Mamitha Baiju: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న ప్రేమలు బ్యూటీ
ప్రేమలు(Premalu) మూవీతో అందరి దృష్టిని ఆకట్టుకున్న మమితా బైజు(Mamitha Baiju) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ పలు సినిమాలు చేస్తూ నటిగా బిజీ అయిన మమిత జీవీ ప్రకాష్(GV Prakash) తో చేసిన రెబల్(Rebel) మూవీతో కోలీవుడ్ కు పరిచయమైంది. తమిళంలో రెండో సినిమానే విజయ్(Vijay) తో కలిసి నటించే అవకాశం అందుకుంది.
దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న జన నాయగన్(Jana Nayagan) మూవీలో మమిత కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ ఆఖరి మూవీగా వస్తున్న ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటి సినిమాలో కీలక పాత్ర అంటే మమిత లక్ మామూలుగా లేదు. అమ్మడి లక్ అక్కడితో ఆగలేద. ఇప్పుడు తాజాగా మమిత మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.
నటుడిగా, డైరెక్టర్ గా వరుస సక్సెస్లు అందుకుంటున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganadhan) హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మమిత ఛాన్స్ కొట్టేసిందట. సుధా కొంగర(Sudha Kongara) దగ్గర పని చేసిన కీర్తీశ్వరన్(Keerthiswaran) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. మైత్రీ లాంటి బ్యానర్ లో సినిమా చేయడమంటే మమిత అదృష్టమనే చెప్పాలి.













