చాలా గ్యాప్ తరువాత తెలుగులోకి మమతా మోహన్ దాస్
యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ నటి, సింగర్, మమతామోహన్ దాస్. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ భామ. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. సుధీర్ఘ విరామం తర్వాత లాల్బాగ్ అనే ఓ చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో నందినీరాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీ రోల్స్ పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తెరెకక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ కాలేదు.













