మొదటిసారి కమర్షియల్ మూవీ చేయనున్న హీరోయిన్
తన కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి కంటెంట్ బేస్డ్, డిఫరెంట్ సినిమాలే చేస్తూ వస్తున్న మలయాళ భామ మాళవిక నాయర్ తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేసుకుని, చేసుకుంటూ వస్తుంది. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు తొలిసారిగా తన దారిని మార్చుకుని ఓ కమర్షియల్ మూవీలో నటించడానికి మాళవిక రెడీ అయింది. ఆ సినిమానే డెవిల్. చడీచప్పుడు లేకుండా సైలెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది ఈ సినిమా. కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కుతుంది.
ఇందులో కళ్యాణ్ రామ్ ఇంతకు ముందెన్నడూ చేయని రీతిలో ఉండే పాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అనౌన్స్ చేయలేదు. తన రీసెంట్గా నటించిన కొత్త చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రమోషన్లలో మాళవిక, డెవిల్ సినిమాలో తనే హీరోయిన్ అనే విషయాన్ని బయటపెట్టింది.
ఇప్పటివరకు కంటెంట్ బేస్డ్ సినిమాల్లో చూసిన మాళవికను కమర్షియల్ మూవీల్లో చూడటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. మరి డెవిల్ లో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మీదే తన ఆశలన్నీ పెట్టుకుని, ఎలాగైనా ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. అన్నీ మంచి శకునములే సినిమాతో మళ్లీ సమ్మర్లో పలకరించబోతోంది.













