మళ్ళీ మళ్ళీ చూశా ట్రైలర్ విడుదల
అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మళ్లీ మళ్లీ చూశా. హేమంత్ కార్తీక్ దర్శకుడు. కె.కోటేశ్వరరావు నిర్మాత. హైదరాబాద్లో అనిల్ సుంకర, రవిశంకర్ యలమంచి, రామ్ సంయుక్తంగా ట్రైలర్ను ఆవిష్కరించారు. అనురాగ్ హుషారుగా కనిపిస్తున్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు అతిథులు. దర్శకుడు మాట్లాడుతూ మళ్లీ మళ్లీ చూడాలనుకునేలా రూపొందించిన చిత్రమిది. కథ, కథనాలు, ఆకట్టుకుంటాయన్నారు. నిర్మాత మాట్లాడుతూ మేము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.













