మళ్లీ మళ్లీ చూశా ఫస్ట్ లుక్ విడుదల
అనురాగ్ కొణిదెన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మళ్లీ మళ్లీ చూశా. శ్వేత అవస్తి, కైరవి తర్కర్ కథనాయికలు. సాయిదేవ రామన్ దర్శకుడు. కొణిదెన కోటేశ్వరరావు నిర్మాత. చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కి తగ్గట్టే మళ్లీ మళ్లీ చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుంది. ఆ ప్రకృతే ఒక ప్రేమని సృష్టిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మా సినిమా అలా ఉంటుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ హైదరాబాద్, అరకు, వైజాగ్‌లో చిత్రీకరణ జరిపాం. మనసుని హత్తుకునే కథ ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.













