మంత్రి కేటీఆర్ కు మమ్ముట్టి ఆహ్వానం
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావును కలుసుకున్నారు. బేగంపేటలోని కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన మమ్ముట్టి ఈ నెల 25న రవీంధ్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ అవార్డుల కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల మమ్ముట్టి ఆసక్తి వ్యక్తం చేశారు. రైతుబంధు పథకంపై ప్రశంసలు కురిపించారు. శబరిమల దేవస్థానం వద్ద కేరళ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ సర్కారు చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు రాష్ట్రంలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.













