ఆశలన్నీ ఒరేయ్ బుజ్జిగా విడుదలమీదే.. ఈ లోగా హైదరాబాద్ లోనే చదువు పూర్తి చేస్తా…
అంటున్న మాళవిక నాయర్.. అయితే ఆమె పేరు మాళవిక మోహనన్. ఈమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన కళ్యాణ వైభోగమే, ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం మహానటిలో కూడా ఈమె అలివేలు జెమినిగణేషన్ పాత్రలో కనిపించి మెప్పించింది. రాకేష్ శశి దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ట్యాక్సీ వాలా వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఇక ప్రస్తుతం ఈమె ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిన ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో ఈమె నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.
ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం ద్వారా తమిళ్ లో కూడా మాళవిక పరిచయం అవుతోంది. మరి మాళవిక నాయర్ విషయానికి వస్తే ఆ తర్వాత ఇక ఈ ఢిల్లీ భామ మలయాళ భాషల్లో కూడా యాక్ట్ చేసింది. ముఖ్యంగా మలయాళంలో ఈమె నటించిన బ్లాక్ బట్టర్ ఫ్లై తో పాటూ కుకూ చిత్రంలో అంధురాలి పాత్రను వేసి మెప్పించింది. ప్రస్తుతం మాళవిక నాయర్ చేతిలో తెలుగు చిత్రాలేవీ లేకపోయినా హైదరాబాద్లోనే ఉంటోంది. దానిలో ఆశ్యర్యం ఏముంది అంటారేమో? లాక్ డౌన్ కారణంగా ఇక్కడే కోరంటైన్ లో ఉందనుకునేరు అది కూడా కాదు. ఈమె సినిమా అవకాశాల కోసం హైదరాబాద్లో ఉండటం లేదంట . తన పై చదువుల కోసం హైదరాబాద్లోనే నివాసం ఉండటం గమనార్హం. ఈ కరోనా రచ్చ తగ్గి పరిస్థితులు బాగైన తర్వాత అయినా ఈ కేరళ కుట్టికి మరిన్ని తెలుగు ఆఫర్స్ వస్తాయేమో వేచిచూడాల్సి వుంది….!













