Malavika Mohanan: లోకల్ ట్రైన్ లో ముద్దులు ఇవ్వమని సైగలు చేశాడు
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ల విషయంలో ఒక్కో పరిశ్రమలో ఒక్కో రూల్ ఉంటుందని మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలిపింది. సౌత్ లో కనిపించాలంటే హీరోయిన్ మరీ సన్నగా ఉండకూడదని, అలా కనిపిస్తే అవకాశాలు రావనిచెప్పిన మాళవిక గతంలో తనని సన్నగా ఉన్నానని ఎంతోమంది ట్రోల్ చేశారని తెలిపింది. ఈ సందర్భంగా మాళవిక తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
వేరే కంపార్ట్మెట్ లోని గ్లాస్ డోర్ నుంచి తొంగి చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని, అతని బిహేవియర్ తనను, తన ఫ్రెండ్స్ ను ఎంతో భయపడేలా చేసిందని, అసలు ఆ సమయంలో ఏం చేయాలో కూడా తమకు అర్థం కాలేదని మాళవిక తెలిపింది. అలా భయపడుతున్న టైమ్ లో వేరే స్టేషన్ లో తమ కంపార్ట్మెంట్లోకి ఇంకొంత మంది ప్రయాణికులొచ్చారని, అప్పుడు తామంతా ఊపిరి తీసుకున్నామని మాళవిక వెల్లడించింది.
ఇక హీరోయిన్ లుక్స్ గురించి మాట్లాడితూ, సౌత్ లో సినిమాలు చేయాలంటే బొద్దుగా ఉండాలని, కానీ నార్త్ లో చేయాలంటే మాత్రం సన్నగా ఉండాల్సిందేనని చెప్పింది. ఈ విషయంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కన్ఫ్యూజ్ అయ్యానని, తర్వాత మెల్లిగా తనకు పరిస్థితులు అర్థమయ్యాయని తెలిపింది. దానికి తోడు సౌత్ లోని హీరోయిన్లంతా బొడ్డు పైనే ఫోకస్ చేస్తారని కూడా మాళవిక చెప్పింది. ప్రస్తుతం మాళవిక తెలుగులో ప్రభాస్(Prabhas) తో కలిసి ది రాజా సాబ్(The Raja Saab) లో నటిస్తున్న విషయం తెలిసిందే.






