Malavika Mohanan: అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు దక్కింది!
తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించిన మాళవిక మోహనన్(Malavika Mohanan) ఎంతోకాలంగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చూస్తుంది. ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి సినిమాలు చేయకపోయినా అమ్మడికి టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపే ఉంది. ప్రస్తుతం రాజా సాబ్(Raja Saab) సినిమాలో ప్రభాస్(Prabhas) సరసన ఛాన్స్ కొట్టేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది మాళవిక.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన టాలీవుడ్ ఎంట్రీ కొన్నేళ్ల కిందట వచ్చిన సలార్(Salaar) తోనే జరగాల్సిందని, కానీ అది లేటై ఇప్పుడు రాజా సాబ్ ద్వారా జరుగుతుందని తెలిపింది. బాహుబలి(Baahubali) సినిమా తర్వాత నుంచి ప్రభాస్ తో వర్క్ చేయాలని ఎంతగానో కోరుకున్నానని, ఆయనతో పని చేయడం కోసం ఎదురుచూశానని అమ్మడు తెలిపింది.
సలార్ సినిమాలో నటించాలని ప్రశాంత్ నీల్(Prasanth Neel) తనను అడిగినట్టు, తాను కూడా సినిమా చేయాలని అనుకున్నట్లు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయినట్టు మాళవిక చెప్పింది. సలార్ లో ఛాన్స్ మిస్ అయినా ఇప్పుడు అదే ప్రభాస్ తో రాజా సాబ్ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని మాళవిక అభిప్రాయపడింది.













