Malaika Arora: వైట్ డ్రెస్ లో మరింత చిన్నగా కనిపిస్తోన్న మలైకా
బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా బాగా పాపులరైన హీరోయిన్లలో మలైకా అరోరా ఖాన్(malaika arora khan) కూడా ఒకరు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న మలైకా ఐదు పదుల వయసులో కూడా 30 ఏళ్ల భామలాగా మెరిసిపోతూ వారికి కాంపిటీషన్ ఇస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే మలైకా తాజాగా వైట్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించడంతో పాటూ తన వయసు కంటే మరో పాతికేళ్లు చిన్నదిగా కనిపించింది. ఈ డ్రెస్ లో మలైకా ఆకట్టుకునే అందాలతో పాటూ తన అవుట్‌ఫిట్ నెటిజన్లను మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి.







