త్వరలో మలైకా అరోరా పెళ్లి ?
బాలీవుడ్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం, రెండవ పెళ్లి చేసుకోవడం, లివింగ్ రిలేషన్షిప్లో ఉండటం అనేది చాలా కామన్. అయితే మలైకా అరోరా, అర్జున్‌కపూర్‌ల వ్యవహారం చాలా విభిన్నం. మలైకా అరోరా తన భర్త అర్భాజ్‌ఖాన్‌తో కలిసి ఉన్నప్పటి నండి అర్జున్పూర్తో ప్రేమ వ్యవహారం నడిపిందని.. చివరికి ఈ ప్రేమ వ్యవహారం కారణంగానే అర్భాజ్‌కు దూరమైందని వార్తలు వచ్చాయి. అయితే అర్భాజాన్ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత తనకు స్వేచ్ఛ దొరికిందని మలైకా ఇటీవల చెప్పింది. ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటి నుంచి అర్జున్‌కపూర్‌తో మలైకా అరోరా బాహాటంగానే తిరుగుతూ కనిపించింది. అయితే ఇద్దరు కూడా తమ రిలేషన్‌షిప్‌పై ఏనాడూ స్పందించలేదు. చివరికి మలైకా, అర్జున్‌కపూర్‌లు ఏప్రిల్ 19న పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. వీరిద్దరి ఇన్నాళ్ల ప్రేమకు పెళ్లి బంధం తోడు కాబోతోంది.













