గుడ్‌న్యూస్ ఫస్ట్‌లుక్ విడుదల
అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్ దొసాంజ్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్‌న్యూస్. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. రాజ్ మెహతా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందులో కరీనా, కియారా గర్భిణీలుగా కనిపిస్తుండగా, వారి బేబీ బంప్‌ల మధ్య నలిగిపోయిన మొహాలతో ఉన్న అక్షయ్, దిల్జిత్‌ల లుక్ నవ్వులు పూయిస్తోంది. ఈ ఏడాదిలో జరిగిన అతిపెద్ద తప్పిదం అంటూ ఈ పోస్టర్‌పై క్యాప్షన్ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది గర్భం చుట్టూ తిరిగే వినోద ప్రధాన చిత్రమని తెలుస్తోంది. క్రిస్మస్ కానుగా డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అక్షయ్ ఈ పోస్టర్‌ను పంచుకుంటూ క్రిస్మస్కు మీకో శుభవార్త చెప్పబోతున్నాం. వేచి ఉండండి అని ట్వీట్ చేశారు.













