పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికరమైన కామెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్‌లో ఉన్న స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ సమయంలో ఉండే హైప్.. క్రేజ్ కూడా పీక్స్‌లో ఉంటాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కూడా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు మరో మెగా వారసుడి ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా నందన్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. తను కూడా సినీ పరిశ్రమలోని వ్యక్తులతో కలివిడిగానే ఉంటున్నాడు. దీంతో అకీరా ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉన్నాయి.
అకీరా నందన్‌తో టాలీవుడ్‌కి చెందిన హీరో అడివి శేష్ ఇద్దరు సన్నిహితంగా ఉంటారు. ప్రతి వారం ఇద్దరూ తప్పనిసరిగా కలుస్తుంటారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు..అడివి శేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో అకీరా నందన్ ప్రస్తావన వచ్చినప్పుడు శేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదే సమయంలో అకీరా నందన్‌తో మీరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు కూడా అడివి శేష్ తనదైన తరహాలో సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన అకీరా నందన్ గురించి ఏమని చెప్పారంటే.. ‘‘నాకు పవన్ కళ్యాణ్గారంటే ఓ గౌరవం ఉంటుంది. ఆయన హీరోగా చేసిన తొలి ప్రేమ నాకెంతో ఇష్టమైన సినిమా. అకీరా నందన్‌తో మల్టీస్టారర్ సినిమా చేసే ఆలోచన లేదు. తను నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇద్దరం ప్రతీ వారం కలుస్తుంటాం. తనకు ఇప్పుడు సినిమాలపై అంత ఆసక్తి లేదు. మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. వాయిద్య పరికరాలతో సంగీతం చేస్తుంటాడు. ఒక్కోసారి తను సొంతంగా కంపోజ్ చేసిన ట్యూన్స్ కూడా పంపుతుంటాడు. వాటిని వింటూ నిద్రపోతాను’’ అని చెప్పారు అడివి శేష్. అకీరా నందన్ గురించి అడివి శేష్ చేసిన కామెంట్స్‌లో తనకు సినిమాలపై ఇప్పుడు అంతగా ఆసక్తి లేదని చెప్పటమే. అకీరా ఎంట్రీ గురించి ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తోన్న ఆయన ఫ్యాన్స్‌కు ఇది కాస్త నిరాశను కలిగించే విషయమే. ఇక అడివి శేష్ ఈ శుక్ర వారం ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. శశి కిరణ్ తిక్కా దర్శకుడు.













