వాలెంటైన్స్ డే సందర్భంగా …మజిలీ టీజర్ విడుదల
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న మజిలీ చిత్రం టీజర్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్లో చైతన్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఒకటి క్రికెటర్ పాత్ర కాగా మరొకటి మిడిల్ ఏజ్ పాత్ర. రెండు క్యారెక్టర్స్‌తోనూ ఆకట్టుకున్నారు నాగచైతన్య. సమంత ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో నటిస్తున్నారు. భర్త పట్ల ఎంతో ప్రేమగా ఉండే భార్యగా ఆమె కనిపిస్తున్నారు. టీజర్లో ఎమోషన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌకిశ్ రెండో హీరోయిన్గా నటిస్తోంది. ఈ టీజర్‌లోని కొన్ని డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. నవ్వు నా రూమ్ లోపలికి రాగలమోగానీ..నా మనసులోకి ఎప్పటికీ రాలేవు. నీకో సంవత్సరం టైమ్ ఇస్తున్నాను.. ఈలోగా సచివ్ అవుతావో.. సోంబేరి అవుతావో.. నీ ఇష్టం, ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు.. అది వస్తువు అయినా.. మనిషి అయినా తదితర డైలాగులు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విష్ణు వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, యాక్షన్: వెంకట్, ఆర్ట్: సాహి సురేష్.













