తన నటనతో నవ్విస్తుంది…ఏడిపిస్తుంది ఆ పాత్ర
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివ్వాంశిక కౌశిక్ మరో కథానాయిక. శివ నిర్వాణ మాట్లాడుతూ వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మధ్య తరగతి భర్తగా పూర్ణ పాత్రలో నాగచైతన్య కనపడతారు. ఆయన పాత్రలో ఇంటెన్స్ ఉంటుంది. శ్రావణి పాత్రలో సమంత కనిపిస్తారు. తన నటనతో నివ్విస్తుంది, ఏడిపిస్తుంది ఆ పాత్ర. మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.













