Mahesh Babu: ఆమిర్ సినిమాకు మహేష్ రివ్యూ

లాల్ సింగ్ చద్దా(lal singh chadda) సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(aamir khan) నుంచి మరో సినిమా వచ్చింది లేదు. చాలా కాలం తర్వాత ఆమిర్ ఖాన్ తిరిగి సితారే జమీన్ పర్(sitaare zameer par) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తారే జమీన్ పర్(taare zameen par) సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా చూసిన వారంతా దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) సితారే జమీన్ పర్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు. ఈ సినిమా అద్భుతమైన సినిమా అని, ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన ఇతర్ క్లాసిక్ సినిమాల్లానే ఈ సినిమా కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, క్లాప్స్ కొట్టేలా చేస్తుందంటూ మహేష్ బాబు పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
సితారే జమీన్ పర్ చూశాక ఆడియన్స్ కచ్ఛితంగా ముఖంపై చిరునవ్వుతో థియేటర్ల నుంచి బయటికి వస్తారంటూ మహేష్ బాబు ఆ సినిమా యూనిట్ ను పొగిడాడు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(ram pothineni) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. వీరు కాకుండా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్(sachin tendulkar), బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(shah rukh khan) కూడా పొగడ్తలు కురిపించారు.