SSMB29: ప్రియాంకను చూసి కంగారు పడుతున్న మహేష్ ఫ్యాన్స్
మహేష్ బాబు(Mahesh Babu)- రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తుందని తెలిసినప్పటి నుంచి అంతా కంగారు పడుతున్నారు. దానికి కారణం ఎస్ఎస్ఎంబీ29(SSMB29)లో హీరోయిన్ ఆమేనేమోననే భయం. మామూలుగా సినిమాల్లో హీరో ఎంత పెద్ద వాడైనా హీరోయిన్ మాత్రం చిన్నమ్మాయే ఉండాలని, గ్లామరస్ గా ఉండాలని భావిస్తుంటాడు.
యువరాజు(Yuvaraju) సినిమాలో మహేష్(Mahesh) పక్కన సిమ్రాన్(Simran) కనిపిస్తేనే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మహేష్ పక్కన ప్రియాంక కూడా అలానే అక్కలా ఉంటుందనేది ఫ్యాన్స్ ఫీలింగ్. అయితే ఈ సినిమాలో ప్రియాంక హీరోయినా లేక మరే పాత్రైనా చేస్తుందా అనేది ఇప్పటివరకు రాజమౌళి టీమ్ కు తప్ప ఎవరికీ తెలీదు.
ఒకవేళ ప్రియాంకనే హీరోయిన్ అయినా సరే రెగ్యులర్ తరహాలో వారి లవ్ స్టోరీ ఉండదని కచ్ఛితంగా చెప్పొచ్చు. అసలే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి ఎన్నో క్యారెక్టర్లు, విదేశీ నటులు ఈ సినిమాలో భాగమయ్యే ఛాన్సుంది. అలాంటప్పుడు ఎవరికి ఏ పాత్ర డిజైన్ చేశాడో జక్కన్న(Jakkanna)కే తెలియాలి. కాబట్టి రాజమౌళి మీడియా ముందుకొచ్చి చెప్పేవరకు నెట్టింట జరిగే ప్రచారాలన్నింటినీ విని వదిలేయడమే తప్పించి లోతుగా వెళ్లి ఆలోచించనక్కర్లేదు.













