మహేష్ 27వ చిత్రంలో సరికొత్త లుక్ తో కనిపిస్తాడా?
హ్యాండ్సమ్ లుక్‌తో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తూ, తెలుగు సినీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ గా మహేశ్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాడు. ఫలితంగా కొన్ని హిట్లను అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు తన లుక్ విషయంలో కెరీర్లోనే తొలిసారి ఓ ప్రయోగం చేయబోతున్నాడట. సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గతంలో ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి సూపర్ హిట్లను అందుకున్న అతడు.. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్ కొట్టాడు.
ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు ఖాతాలో పలు రికార్డులు కూడా వచ్చి చేరాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్ బాబు.. ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఈ సినిమా మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతోందని, ఇందులో మహేశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. కొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో.. దీన్ని పక్కన పెట్టేశాడు విషయం తెలిసిందే.
వంశీ పైడిపల్లితో సినిమా ఆగిపోవడంతో మహేశ్ బాబు ఏ డైరెక్టర్‌తో జట్టు కట్టబోతున్నాడన్న దానిపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వాటన్నింటినీ తల్లకిందులు చేస్తూ ‘గీత గోవిందం’ ఫేం పరశురాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రేమ, కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రియేటర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను ఉగాదికి ప్రారంభించాలని భావించారు. కానీ, కరోనా ప్రభావంతో వాయిదా పడింది. ఈ సినిమా ప్రారంభోత్సవ తేదీని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మే 31కి ఫిక్స్ చేశారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అదే రోజున సినిమా టైటిల్ కూడా రివీల్ చేస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. విషయం ఏమిటంటే గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున మే 31నాదే సరి లేరు నీకెవ్వరూ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ కూడా లీక్ అయింది. దీని ప్రకారం.. ఇందులో అతడు గుబురు గెడ్డంతో దర్శనమివ్వబోతున్నాడట.
అతడి కెరీర్లో ఇలాంటి లుక్ ఇంత వరకు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. అలాగే, ఒత్తైన జుట్టు కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.













