కోవిడ్ 19పై పోరు సాగిస్తోన్న డాక్టర్లను, పోలీసులను అభినందించిన సూపర్‌స్టార్ మహేష్
కోవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం అంతా స్తంభించింది. మన దేశం విషయానికి వస్తే దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు, ప్రముఖులు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. సినీ తారలు ఇళ్లల్లోనే ఉంటూ ప్రజకు కరోనా వైరస్ ప్రభావాన్ని అర్థమయ్యేలా సామజిక మాధ్యమం ద్వారా వివరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టడానికి డాక్టర్లు, ఇటు పోలీసులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు అహర్నిశాలు కష్టపడుతున్నారు. కరోనా నివారణలో వీరు చేస్తున్న కృషిని అందరూ శ్లాఘిస్తున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ డాక్టర్స్, పోలీస్ శాఖ చేస్తున్న హార్డ్ వర్క్‌ను తన ట్విట్టర్ ద్వారా అభినందించారు.
డాక్టర్స్‌కు అభినందనలు
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డాక్టర్స్ కృషిని మహేష్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. లాక్డౌన్ పూర్తి కావడానికి ఇంకా ఐదు రోజుల వున్నాయి. మనం విజయవంతంగా పూర్తి చేశాం. మనం చాలా బలంగా ఉన్నాం. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనికి ప్రజలు కూడా సహకరించారు.
ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కరోనా వైరస్‌పై పోరాటానికి ముందుండి పోరాడుతున్న డాక్టర్స్‌కు అభినందనాలు . సామాజిక దూరం పాటించడం ఎంత ముఖ్యమో మరో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అంతే ముఖ్యం. ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేస్తున్న వ్యక్తులకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. ఇలా మనల్ని మిస్ గైడ్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదే’’ అన్నారు.
పోలీసుల రుణం తీర్చుకోలేనిది..
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ప్రజ సంక్షేమార్థం విధించిన అంక్షను పోలీసు నిబద్ధతతో అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ పోటీసును కూడా అభినందించారు. ‘‘కోవిడ్ 19పై అలుపెరుగని పోరాటం చేస్తున్న తెలంగాణ, ఆంధ్ర పోలీసులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి ప్రతిపల ఆశించకుండా తన వారికి దూరంగా వుంటూ వారెంతో కష్టపడుతున్నారు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మన ప్రాణాలు కుటుంబ ప్రాణాల కు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. పోలీస్ శాఖవారి రుణం తీర్చుకోలేం. మన దేశం పట్ల, ప్రజల పట్ల డేడికేషన్‌తో పనిచేస్తున్న పోలీసుకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం’’ అన్నారు.













