మహేష్- రాజమౌళి మూవీ లేటస్ట్ అప్డేట్ Inbox
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో రాజమౌళి తొందర పడకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ కోసం రాజమౌళి ఏకంగా ఏడాదికి పైగా టైమ్ తీసుకుని రీసెంట్ గానే స్టోరీని లాక్ చేశాడని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపాడు.
జులై నుంచి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతాయని కూడా కీరవాణి గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉందనే, రీసెంట్ గా సినిమాలోని నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో నటించే ప్రతీ ఒక్కరికీ స్క్రీన్ టెస్ట్ పెట్టి అందులో ఓకే అనుకుంటేనే రాజమౌళి వాళ్లను సెలెక్ట్ చేయనున్నాడు. అంటే ఆర్టిస్టుల ఎంపిక కోసమే కనీసం ఆరు నెలలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు రాజమౌళి సినిమా కోసం సెట్స్ వర్క్స్ ను కూడా స్టార్ట్ చేయించే ఛాన్స్ కనిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాతో రాజమౌళి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.













