SSMB29: నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా ఇది రూపొందుతుంది. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో తీర్చి దిద్దుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
ఎస్ఎస్ఎంబీ29లో మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, అందులో భాగంగానే ఫస్టాఫ్ లో హీరో క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని, తర్వాత సెకండాఫ్ లో ఆ పాత్ర పాజిటివ్ గా మారుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఫస్ట్ టైమ్ మహేష్ ను నెగిటివ్ షేడ్స్ రోల్ లో చూసే అవకాశం ఉంటుంది. సినిమా మొత్తానికి మహేష్ క్యారెక్టర్ హైలైట్ అవనుందని సమాచారం.
ఆఫిక్రన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసిన రాజమౌళి ఇప్పటివరకు ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడం విశేషం. కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ(KL Narayana) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.