పూరీని తలచుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
స్టార్ హీరోతో సినిమాలు చేసిన ప్రతీ ఒక్క డైరెక్టర్ ను ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోరు. కానీ ఆ హీరోతో మ్యాజిక్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. మర్చిపోలేరు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పూరీ జగన్నాథ్ ను తెగ గుర్తు చేసుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా చూశాక మహేష్ ఫ్యాన్స్ పూరీని తలచుకుంటున్నారు.
గుంటూరు కారంలో మహేష్ కష్టం తప్ప, త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదన్నది మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శ. సినిమా మొత్తాన్ని మహేషే తన భుజాలపై వేసుకుని నడిపించాడు. మామూలుగా స్టార్ హీరోల సినిమాల్లో డైరెక్టర్ కష్టం కనిపిస్తేనే హీరో ఎంత కష్టపడినా ఉపయోగముంటుంది. కానీ గుంటూరు కారంలో విషయంల మహేష్ కష్టం మాత్రమే కనిపిస్తుంది తప్పించి త్రివిక్రమ్ కష్టం ఎక్కడా కనిపించడం లేదు.
అందుకే మహేష్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ ను ఆయన ఫ్యాన్స్ తలచుకుంటున్నారు. మహేష్ తో పూరీ చేసిన పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు రెండూ సూపర్ హిట్లే. మహేష్ క్రేజ్ ని, తన టాలెంట్ ను పూరీ చాలా బాగా వాడుకున్నాడు. అందుకే మహేష్ తో రెండు సార్లు హిట్ కొట్టాడు. వీరి కాంబినేషన్లో జన గణ మన కూడా అనౌన్స్ చేశారు కానీ పూరీ ట్రాక్ రికార్డ్ వల్ల మహేష్ ఆ ఛాన్స్ ఇవ్వలేదని పూరీ మీడియా సాక్షిగా చెప్పాడు.













