థియేటర్లను కళ్యాణ మండపాలుగా మార్చేసిన మహేష్ ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ ఫ్యానిజాన్ని చూపించే విషయంలో తారాస్థాయికి చేరుతున్నారు. మహేష్ కెరీర్లో హెవీ సెంటిమెంట్ ఉన్న మురారి సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు దానికి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఫస్ట్ డే సుమారు రూ.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ కావొచ్చనేలా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
బెంగుళూరు లో సైతం మార్నింగ్ ఆరు గంటల షోకు హౌస్ ఫుల్స్ పడ్డాయంటే మహేష్ ఫ్యాన్స్ హంగామా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా పక్కనపెడితే మహేష్ ఫ్యాన్స్ థియేటర్లను కళ్యాణ మండపాలుగా మార్చేశారు. కటవుట్స్ దగ్గర మామిడాకులతో తోరణాలు కట్టి కొబ్బరాకులతో డెకరేషన్ చేయించి అక్కడ ఓ జంట కూర్చోడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
క్లైమాక్స్ కు ముందొచ్చే అలనాటి సాంగ్ కు అందరికి తలంబ్రాలు పంచి ఒక అభిమానితో మరో అభిమానికి ఉత్తుత్తి తాళి కట్టించి ఈ రీరిలీజ్ వేడుకను నెక్ట్స్ లెవెల్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమాకు ఇప్పుడు ఈ రేంజ్ రెస్పాన్స్ ను ఎవరూ ఊహించలేదు.













