SSMB29: మరోసారి మహేష్ ఫ్యాన్స్ కు నిరాశేనా?
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29(SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే సెట్స్ పైకి వెళ్లి ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అనౌన్స్మెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మహేష్ తండ్రి కృష్ణ(Krishna) బర్త్ డే కానుకగా వస్తుందనుకున్నారు కానీ అప్పుడు కూడా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఇప్పుడు ఈ ఇయర్ బర్త్ డే కు అయినా ఎస్ఎస్ఎంబీ29 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఈసారి కూడా నిరాశే మిగిలేలా ఉంది. కనీసం అనౌన్స్మెంట్ అయినా ఇస్తే బావుండని ఫ్యాన్స్ భావిస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం దానికింకా టైముందంటున్నారట. జక్కన్న ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే తెలిసింది.







