మహేష్, ఎన్టీర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన సినిమా సంభాషణ
ఏ హీరో అభిమానులైన తమ హీరో వంటిమీద ఈగ కూడా వాలనివ్వరు సరదాగా వేరే హీరో జోక్ చేసినా జోక్‌ని జోక్‌లా చూడరు. తమ హీరోని ఎవరైనా కామెంట్ చేసారంటే ఇక అసలు ఊరుకోరు. గతం లో యన్టీర్, ఏన్నార్, కృష్ణ అభిమాన సంఘాల మధ్య ఎప్పుడు ఏదో గొడవలు ఉండేయి ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హీరోలఅందరూ ఒకరికి ఒకరు బర్త్ డే విషెస్ చెప్పుకోవడం ఫంక్షన్స్ లో కోవడం, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరు ఒకటే అన్నట్లు మసులుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే… ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన తెలుగు సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో రెండు క్యారెక్టర్లను మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌గా చూపించారు.
ఈ క్యారెక్టర్ల మధ్య సంభాషణ కూడా సగటు హీరోల అభిమానులకు తగ్గట్టే వుండేలా దర్శకుడు మహా డైలాగులు రాసాడు. మహేష్ ఫాన్ అయిన అమ్మాయిని ఉడికించడానికి… ఎన్టీఆర్ ఫ్యాన్ ఇలా అంటాడు ‘మీవాడు లేజీ. నిలబడ్డ చోటినుంచి కదలకుండా ఫైట్ చేస్తాడు. మావాడు యాక్టివ్. ఎలా పరుగెడుతున్నాడో చూసావా?’ అంటాడు. దానికి ఆమె ‘మావాడు క్లాస్’ అంటుంది. ఇది సరదా సంభాషణే అయినా కానీ మహేష్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. అసలే హర్టయిన వాళ్లను ఎన్టీఆర్ ఫాన్స్ మరింతగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం లోని సన్నివేశం మహేష్ ఎన్టీర్ ఫాన్స్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మామూలుగానే ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటూ వుంటారు. సినిమా లో ఈ డైలాగ్ దొర్లెసరికి సోషల్ మీడియా లో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసారు. ఇదంతా చూస్తే… మళ్లీ మన హీరోల గురించిన సరదా కామెంట్ చేయడానికి కూడా ఎవరైనా జంకుతారు.













