రాజమౌళి మూవీ కోసం మహేష్ అంత ఛార్జ్ చేస్తున్నాడా?
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ను తీయనున్న సంగతి తెలిసిందే. మహేష్29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి ఎప్పటిలాగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారు. ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో ఈ అడ్వెంచర్ సినిమా సాగనుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. రాజమౌళి సినిమా కోసం ఏ హీరో అయినా సరే ఫిట్ గా ఉండాల్సిందే. దాని కోసం నెలల తరబడి ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకొంటారు హీరోలు. ఇప్పుడు మహేష్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఓ వైపు గుంటూరు కారం సినిమా చేస్తూనే, మరోవైపు రాజమౌళి సినిమా కోసం మహేష్ కుస్తీలు పడుతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ హాలీవుడ్ సంస్థ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టిందని తెలుస్తోంది. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ మూవీ కోసం మహేష్ చాలా పెద్ద మొత్తంలో రూ.110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













