మహేష్ పోస్టర్స్ తో ప్రమోషన్స్
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఓ మై బేబీ సాంగ్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆ నెగిటివిటీని పోగొట్టేందుకు మేకర్స్ పోస్టర్లను వదులుతున్నారు.
రిలీజ్ చేస్తున్న పోస్టర్లతో ఆ డ్యామేజ్ దాదాపు తగ్గుతుందనే చెప్పాలి. రీసెంట్గా మహేష్, శ్రీలీల కలిసి డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. తర్వాత మహేష్ బీడీ కాలుస్తూ టేబుల్ మీద కూర్చున్న స్టిల్ కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. స్టిల్ కొత్తగా లేకపోయినా అందులో మహేష్ క్యారెక్టర్ బాగా మాస్ గా ఉంటుందని ఈ పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది.
దానికి తోడు ఫ్యాన్స్ హ్యాండిల్స్లో ఈ పోస్టర్స్ ను రిలీజ్ చేయడం కూడా సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటిదాకా పబ్లిసిటీ పరంగా గుంటూరు కారంకు హైప్ తీసుకొచ్చే కంటెంటేదీ సినిమా నుంచి బయటకు రాలేదు. ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటూ సగటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల 6న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడే ట్రైలర్ ను లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రమోషన్స్ ఎలా చేసినా సంక్రాంతికి రానున్న సినిమాల్లో ఆడియన్స్ కు ఫస్ట్ ఛాయిస్ మాత్రం గుంటూరు కారమే కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.













