గుంటూరు కారం టీమ్ అర్జెంట్‌గా చేయాల్సిన పనులివే
రీసెంట్ గా గుంటూరు కారం నుంచి రిలీజైన ఓ మై బేబీ పాట వల్ల ఎవరూ ఊహించని నష్టం సినిమాకు జరిగింది. ఈ సాంగ్ ఆడియన్స్ ఊహించిన రీతిలో లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయంలో తమన్ ని చాలా దారుణంగా టార్గెట్ చేసి నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
దీంతో సాంగ్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి ఒళ్లు దగ్గర పెట్టుకోండి అని వార్నింగ్ ఇవ్వడం ఈ విషయాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. అయితే ఈ డ్యామేజ్ ను పూడ్చటానికి గుంటూరు కారం టీమ్ కు కొన్ని కర్తవ్యాలున్నాయి. ఇప్పటికే సెకండ్ లిరికల్ విషయంలో డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేయాలంటే మంచి మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయాలి.
రెండోది ట్రైలర్ ను వీలైనంత త్వరగా కట్ చేసి, రీరికార్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని రిలీజ్ చేస్తే చాలు. రీసెంట్ గా అయిన గాయాన్ని మర్చిపోతారు. అందుకే గుంటూరు కారం విషయంలో మరోసారి ఇలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. గుంటూరు కారం సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వల్లే ఇలా ఫ్యాన్స్ ప్రతీ దానికీ డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.













