ఫ్యాన్స్ ను కలవనున్న సూపర్ స్టార్
గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది ఇంకా చెప్పలేదు కానీ మహేష్ ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎంతలేదన్నా ఈ సినిమా షూటింగ్ కు రెండేళ్లు పడుతుంది. ఈ గ్యాప్ ఫ్యాన్స్ కు చాలా ఎక్కువ.
మధ్యలో మహేష్ కనీసం వాళ్లను కలుసుకునే ఛాన్స్ ను కూడా రాజమౌళి ఇవ్వడు. అందుకే ఈలోపు మహేష్ చేయబోయే యాడ్ షూట్స్ స్పాట్స్ కు దగ్గరలో ఫ్యాన్స్ ను కలిసేలా మహేష్ టీమ్ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్యాన్స్ అసోసియేషన్లకు ఈ మేరకు ప్రాథమిక సమాచారం అందినట్లు సమాచారం.
మామూలుగా అయితే ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు మహేష్ ఫోటో సెషన్ పెట్టడం మామూలే. కానీ గుంటూరు కారం సినిమాకు ఈసారి కుదరలేదు. దీంతో ఫ్యాన్స్ మనసులో ఉన్న లోటును తీర్చేందుకు ఇప్పుడు మహేష్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా కోసం మహేష్ ఇప్పటినుంచే ఫిజికల్ ఫిట్నెస్ కు సంబంధించిన సెషన్స్ కూడా స్టార్ట్ చేశాడట. ఈ సినిమా సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













