మహేష్ కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ టైటిల్ ఎలా లీక్ అయ్యిందబ్బా?
మీడియాలో ఫేక్ న్యూస్ లపై తెలుగు సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించిన విషయం విదితమే అయితే లేని వార్తను సృటించి సెలబ్రిటీ ఇమేజ్ ని కిల్ చేయడం వార్తను సంచలనం చేయడం డిజిటల్ మీడియాకి కొత్తేమీ కాదు. అలాగని ఒక్కోసారి నమ్మాల్సిన నిజమైన వార్తలు బయట పెట్టడంలో ఆయా సెలబ్రిటీస్ ని ఇబ్బందులు పెడుతుంటాయి . తాము సీక్రెట్‌గా వుంచి, బిగ్ బాంగ్ గా ప్రకటిద్దామనుకుని సర్ప్రైజ్ చేద్దామనుకున్న కొన్ని ఫ్లాష్ న్యూస్ లు ముందుగా మీడియాలో లీక్ అయిపోతే వారికి చిరాకు పుడుతుంది. అలాగే తన కొత్త సినిమా టైటిల్ బయటకు రావడం మహేష్‌కి అసహనం కలిగించిందట.
విషయానికొస్తే… పరశురామ్ డైరెక్షన్లో మహేష్ చేసే చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ సూచించినపుడు మహేష్ బాగా ఎక్సయిట్ అయ్యాడట. చాలా క్యాచీగా, సినిమాపై ఆసక్తి పెంచేలా వుందని చెప్పాడట. ఈ టైటిల్‌ని చాలా గోప్యంగా వుంచి గత ఏడాది తన తండ్రి పుట్టిన రోజునాడు ‘సరిలేరు నీకెవ్వరూ’ ఏ విధంగా టైటిల్ ప్రకటించారో’? ఈ ఏడాది మే 31న పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా ప్రకటించాని మహేష్ భావించాడట. అయితే ఈలోగా మీడియాకి ఈ టైటిల్ లీక్ అయిపోయింది. మహేష్ ప్రకటించేలోపే పేరు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీడియాకి తెలియకుండా ఎందుకు దాచలేరని, నాలుగు గోడ మధ్య, కేవలం టీం సమక్షం మధ్య జరిగే సంభాషణ బయటకు ఎలా వెళుతున్నాయని మహేష్ తన పీ.ఆర్. టీమ్‌పై అసహనం వ్యక్తం చేసాడని వదంతు వినిపిస్తున్నాయి. రాంగ్ న్యూస్ వస్తే కిల్ ఫేక్‌న్యూస్ అంటూ ట్రెండ్ చేయగరు కానీ వాస్తవాు బయటకు వస్తే సేవ్ ఫ్యాక్ట్స్ అంటూ ట్రెండ్ చేయలేరుగా.













