ధనుష్ దర్శకత్వంలో మహేష్ మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా సినిమాలు చేస్తూ విభిన్న కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. తెలుగులో కూడా ధనుష్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. గతేడాది సార్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చేస్తున్నాడు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా కనిపించే ధనుష్ లో ఎంతో టాలెంట్ ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ధనుష్ దర్శకత్వంలో రీసెంట్ గా రాయన్ అనే సినిమా వచ్చింది. మొదటి షోకు మంచి రెస్పాన్స్ రాకపోయినా తర్వాత్తర్వాత చిన్నగా సక్సెస్ రూట్ లోకి వెళ్లింది. కథ రొటీనే అయినప్పటికీ ధనుష్ డైరెక్షన్, రెహమాన్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయని సినిమా చూసినవాళ్లంతా చెప్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. రాయన్ సినిమా బాగుందంటూ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పిన మహేష్ ఇదొక మస్ట్ వాచ్ మూవీ అంటూ రివ్యూ ఇచ్చాడు. మహేష్ కు ఏదైనా సినిమా నచ్చితే దాని గురించి కచ్ఛితంగా ట్వీట్ చేస్తాడు. ధనుష్ ను మహేష్ పొగుడుతూ వేసిన ట్వీట్ కు ధనుష్ థాంక్స్ చెప్పడం, ఇదంతా చూసి ధనుష్ డైరెక్షన్ లో మహేష్ మూవీ చేస్తే బావుంటుందని నెట్టింట చర్చలు పెడుతున్నారు. నిజానికి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అది నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది జరగడం కష్టమే. ఏమో భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.













