గుంటూరు కారం కు మహేష్ ఫిక్స్ అయ్యేట్లున్నాడే
మహేష్ బాబు కొత్త సినిమా గురించి కొన్ని రోజులుగా నెగిటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ సినిమా కోసం ఆల్రెడీ చిత్రీకరించిన సీన్స్ అనుకున్నంత బాగా రాకపోవడంతో షూటింగ్ ఆగిందని, మళ్లీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వార్తలొచ్చాయి. ఈ కారణంతోనే మహేష్ కొత్త షెడ్యూల్ కూడా మొదలుపెట్టకుండా ఫారిన్ ట్రిప్ వెళ్లాడని కూడా వార్తలొచ్చాయి.
అయితే ఆ వార్తలన్నీ సద్దుమణిగి, త్వరలోనే కొత్త షెడ్యూల్ ఉంటుందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే కొత్త షెడ్యూల్ ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా రోజులుగా ఊహాగానాలొస్తుండగా, కొత్తగా మరి కొన్ని టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఇంతకుముందు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ గురించి బాగా ప్రచారం జరిగింది. కానీ దాని మీద ఎక్కువ శాతం నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో దర్శకుడు త్రివిక్రమ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్లో గుంటూరు అనే పదం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు మిర్చి, గుంటూరు అబ్బాయి, గుంటూరు కారం అనే మూడు టైటిల్స్ ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో గుంటూరు కారం అనే టైటిల్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
మాస్ కు ఈజీగా కనెక్టయ్యేలా గుంటూరు కారం అనే టైటిల్ పెడదామని చిత్ర యూనిట్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు కానీ త్వరలోనే టైటిల్ ను ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటూ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్సుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.













