మహేష్ కి జోడిగా శ్రద్ధాకపూర్!
సాహో సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది. తాజాగా తెలుగులో ఆమె మహేష్‌బాబు సరసన నటించబోతున్నట్లు సమచారం. మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా మహేష్‌బాబు సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధాకపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమచారం. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.













