మహేష్ ని రాజమౌళి జేమ్స్ బాండ్ గా చూపించనున్నారా?
ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా చర్చనీయాంశంగా మారిన వార్తల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చేయబోయే సినిమా ప్రముఖంగా నిలుస్తోంది. దాదాపుగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించే చర్చ. అసలు వీరిద్దరి కాంబో సినిమా ఎలా ఉండబోతోంది, స్టోరీ ఏంటి, మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎంత భారీ ఖర్చు పెడుతున్నారు, ఇలా అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ఓవైపు తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం సూపర్ స్టార్ మహేష్ సిద్ధం అవుతుంటే, మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కోసం రాజమౌళి రెడీ అవుతున్నారు. వీటి తరువాత మహేష్, రాజమౌళిల కాంబోలో రానున్న ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్. నారాయణ నిర్మించనున్నారు. వాస్తవానికి ఈ ప్రాజక్ట్ ఎప్పుడో కొన్నేళ్ల క్రితం తెరకెక్కాల్సి ఉండగా, అప్పటి నుండి మహేష్, రాజమౌళి ఎప్పటికప్పుడు తమ ప్రాజక్ట్స్ తో బిజీ కావడంతో, ఫైనల్ గా అది ఫిక్స్ అవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇక ఈ సినిమా కథ, కథనాల విషయమై ఇటీవల తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చించిన రాజమౌళి, ఒక గొప్ప ఆలోచలన చేశారట. సూపర్ స్టార్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు కౌబోయ్, బాండ్ సినిమాలను పరిచయం చేసిన వ్యక్తి. అయితే గతం లో మహేష్ జయంత్ దర్శక నిర్మాతగా కౌబోయ్ మూవీ చేయడం జరిగింది. ఆ చిత్రం పరాజయం పొందింది. ఇటీవల ‘స్పైడర్’ చిత్రం విడుదలకు ముందు ఇదేదో ఏజెంట్ మూవీ అనుకున్నారు అంతా కానీ అదో టైపు సినిమా అయ్యింది.
వాస్తవానికి మహేష్ ఫ్యాన్స్, ఆయనను ఎప్పటినుండో ఈయాన్ ఫ్లెమింగ్స్ ‘జేమ్స్ బాండ్’ తరహా పాత్రలో చూడాలని ఆశిస్తున్నారని, మీకు వీలైతే ఆ తరహా పాయింట్ ని సిద్ధం చేయండి, లేదంటే మంచి కమర్షియల్ జానర్ లో, పక్కా మాస్ స్టైల్ లో సాగే యాక్షన్, ఎంటర్టైనర్ మూవీ ని తీద్దాం అని అన్నారట. అయితే ఈ రెండిటిలో ఏది స్టోరీ గా సిద్దమయినప్పటికీ, ఈ సినిమా ద్వారా ఇప్పటివరకు మరే దర్శకుడు కూడా మహేష్ ని చూపించని సరికొత్త స్టైల్ లో ప్రెజెంట్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరి క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉండనున్నాయో, అసలు ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలి అంటే, మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.













