మహేష్ కెరీర్లో మొదటిసారి ఇలా..
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుకాబోతుంది. పూజా హెగ్డే, శ్రీ లీల ఇద్దరూ ఈ సినిమాలో మహేష్ కు జోడీగా నటించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఓ కీ రోల్లో కనిపించబోతున్నాడు.
అయితే అనిల్ కపూర్ చేస్తుంది విలన్ క్యారెక్టరా లేదా హీరో ఫాదర్ క్యారెక్టరా అనేది తెలియరాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు ఫిల్మ్ నగర్లో కోడై కూస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీలే కనిపిస్తాయి.
ఫ్యామిలీ కోసం ఏమైనా చేసే కొడుకుగా సినిమాలో మహేష్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తుంటాడు త్రివిక్రమ్. ఇంఆ చెప్పాలంటే త్రివిక్రమ్ సినిమాలో హీరో అంటే హైపర్ యాక్టివ్ గా ఉంటూనే చాలా తెలివిగా ఉంటాడు. అలాగే రాముడు మంచి బాలుడులా కుటుంబమే ప్రాణంగా ఉంటాడు. హీరోయిన్ క్యారెక్టర్లు చాలా ఫన్నీగా ఉంటాయి.
అలాగే హీరోకి అత్తో, పిన్నో, అమ్మో కచ్చితంగా ఉంటుంది. ఏదొక సెంటిమెంట్ అంటూ ఏదోక ఎలివేషన్ని తీసుకుని దాని చుట్టూ కథని బలమైన సంభాషణలతో అల్లుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. ఈ బలమైన ఎమోషన్స్ కారణంగా త్రివిక్రమ్ సినిమాలకి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.
అయితే ఈసారి మహేష్ కోసం త్రివిక్రమ్ జోనర్ మార్చినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా అలా అని యాక్షన్ థ్రిల్లర్‌లోకి వెళ్లకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం మహేష్ పొడవాటి హెయిర్ స్టైల్‌తో సన్నని గడ్డంతో డిఫరెంట్‌గా రెట్రో హీరో తరహాలో కనిపిస్తాడని తెలుస్తోంది. మహేష్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఇలా ట్రై చేసింది లేదు. మరి మహేష్ చేస్తున్న కొత్త ప్రయోగం ఫ్యాన్స్ ను మెప్పిస్తుందా లేదా చూడాలి.













