తివ్రికమ్ మహేష్ కాంబో షురూ
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ పుట్టిన రోజు పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రచారం చిత్రం విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రం ద్వారా సినిమాకు పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రాన్ని ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా మధీ, సంగీత దర్శకునిగా తమన్ పనిచేస్తున్నారు. అలాగే మహేష్ బాబు సరసన బాలీవుడ్ పూజాహెగ్దే నటిస్తోంది. సినిమాకు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంతో పాటుగా ఇతర వివరాలు త్వరలో చిత్ర నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు. ఈ భారీ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), రచన, దర్శకత్వం : త్రివిక్రమ్.













