సూపర్‌స్టార్‌ను మెప్పించిన హీరోయిన్!
తన సినిమాల్లోనూ, తను చేసిన యాడ్స్‌లోనూ తప్ప సాధారణంగా బయట ఎక్కడా కనిపించని మహేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగులు చేయకపోవడం వల్ల టాప్ హీరోలంతా బాగా ఖాళీ అయిపోయారు. ఈమధ్యకాలంలో మహేష్ తన కుటుంబంతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం వల్ల అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి మహేష్ అల్లరి చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఓ తమిళ్ సినిమా చూసి ముగ్ధుడయ్యాడు మహేష్. అదేమిటంటే తమిళ్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఓ మై కడవులే మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాను ఇటీవల వీక్షించిన మహేష్ సినిమా చాలా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రితికా సింగ్… మహేష్ ట్వీట్ చూసి పొంగిపోతోందట. సూపర్‌స్టార్ తన సినిమాను మెచ్చుకోవడం నమ్మలేకపోతోందట. `నేను నటించిన `ఓ మై కడవులే` సినిమాను సూపర్‌స్టార్ మహేష్ మెచ్చుకోవడం నాకు సూపర్ కిక్ ఇచ్చింది. ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. థాంక్యూ సార్` అంటూ తన ఆనందాన్ని తెలియజేసింది.
అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్, షరా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో రితిక పెర్ఫార్మెన్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. సాలా కడూస్ చిత్రాన్ని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రితిక మంచి పెర్ఫార్మర్ అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత రితిక్ తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నీవెవరో పేరుతో వచ్చిన ఒక్క సినిమాలోనే రితిక కనిపించింది. అయితే తమిళ్లో ఆమె రెండు సినిమాల్లో నటిస్తోంది. బాక్సర్, వానాంగముడి పేరుతో రూపొందుతున్న రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.













