మహేష్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్
లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు ప్రతిమను రూపొందించబోతున్న విషయం విదితమే. భరత్ అనే నేను సక్సెస్ అనంతరం మహేష్‌బాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో మహేష్ ప్రతిమ ఏ స్టయిల్లో ఉంటుంది, ఎలా వస్తుందోననే ఆసక్తి అభిమానులతోపాటు అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్‌కి మ్యూజియం బృందం సర్‌ప్రైజ్‌నిచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న విగ్రహానికి సంబంధించిన ఓ ఫొటోను తయారు చేస్తున్న ఇవాన్ రీస్ అనే వ్యక్తి పంచుకున్నారు. తల భాగం వరకు తీర్చిదిద్దిన ఈ ప్రతిమ ఆకట్టుకుంటోంది. త్వరలోనే పూర్తి విగ్రహాన్ని తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.













