గోవా లో సర్కారు వారి ఫైట్
గోవాలో సర్కారు వారి పాట తాజా షెడ్యూల్ ఓ ఫైట్‌తో మొదలైంది. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. గోవా షెడ్యూల్లో ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా లొకేషన్ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యాక కొంత టాకీ పార్టును కూడా షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు కీలక తారాగణం పాల్గొంటారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం :తమన్, లైన్ ప్రొడ్యూసర్:రాజ్‌కుమార్.













