మహేశ్ బాబుతో మహేశ్ బాబుని చూసే రోజు వస్తుంది!
మహేశ్‌బాబు పక్కన మహేశ్‌బాబు నిలబడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఫిబ్రవరి నెలాఖరున హైదరాబాద్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్, సింగపూర్‌లో మహేశ్ మైనపు ప్రతిమ నెలకొల్పనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం మ్యూజియమ్ ప్రతినిధులు మహేశ్ కొలతలు తీసుకువెళ్లారు. ఇప్పుడా మైనపు ప్రతిమను హైదరాబాద్ తీసుకురానున్నారు. మహేశ్ ఏ రోజు అందుబాటులో ఉంటాడో చూసుకుని ఆరోజు గచ్చిబౌలిలోని ఎఎంబి మల్టీప్లెక్స్‌లో మహేశ్ ప్రతిమను ఆవిష్కరించనున్నారు. తర్వాత సింగపూర్‌కి, అక్కణ్ణుంచి లండన్‌లో టూస్సాడ్స్ మ్యూజియమ్ హెడ్ క్యార్టర్స్కి తరలిస్తారట.













