తన పుట్టిన రోజు సందర్భంగా… మూడు మొక్కలు నాటండి
అభిమాన హీరో పుట్టినరోజు వస్తోందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. వారం ముందునుంచే వారి హడావిడి కనిపిస్తుంటుంది. కేక్ కట్ చేయడం. భారీ కటౌట్లు, పెట్టి పాలాభిషేకాలు చేయడంతో పాటు రక్తదానం, అన్నదానం వంటివి చేస్తుంటారు. అయితే తన పుట్టినరోజు (ఆగస్టు 9) ఇలాంటివి కాకుండా ఒక్కొక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని హీరో మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని ఇన్స్టాగ్రామ్ వేదికగా కోరారాయన. కాగా మహేశ్ బాబు పిలుపుపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదిక హర్షం వ్యక్తం చేశారు.













