గుంటూరు కారం కోసం బాగానే తీసుకుంటున్న మహేష్
మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాలో పూజా హెగ్డేను మొదటి హీరోయిన్ గా ,శ్రీలీల ను సెకండ్ లీడ్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల పూజా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ను శ్రీలీల కొట్టేసింది.
హిట్2 ఫేమ్ మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్ పవర్ ఫుల్ మాస్ రోల్ కనిపించనున్నాడు. మహేష్ కోసం త్రివిక్రమ్ కంప్లీట్ మాస్ రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వినిపిస్తుంది.
గుంటూరు కారం సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. నాన్ పాన్ ఇండియా స్టార్స్ లో ఇప్పటివరకు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా మహేష్ ఇప్పుడు రికార్డుకెక్కాడు. దీనికి కారణం మహేష్ గత కొంతకాలంగా హిట్ ట్రాక్ లో ఉండటమే. ఆ కారణంగానే మహేష్ కు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది.













