Mahesh Babu: మహేష్ కు స్వేచ్ఛనిచ్చిన జక్కన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కనీసం అనౌన్స్మెంట్ కూడా లేకుండానే ఈ సినిమాను మొదలుపెట్టిన రాజమౌళి ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా అంటే తన హీరోకు ఆయన ఎన్ని కండిషన్స్ పెడతాడో తెలిసిందే.
మహేష్ బాబుకు కూడా జక్కన్న అలాంటి కండిషన్సే పెట్టాడు. అందులో భాగంగానే సినిమా షూటింగ్ మొదలైనప్పుడే మహేష్ బాబు పాస్పోర్ట్ ను లాగేసుకుని ఒక మీమ్ ను పోస్ట్ చేశాడు మహేష్. అయితే ఇప్పుడు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని నెక్ట్స్ షెడ్యూల్ కు కాస్త బ్రేక్ రావడంతో రాజమౌళి, మహేష్ కు కాస్త ఫ్రీడమ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ బ్రేక్ లో మహేష్ వెకేషన్ కు వెళ్లడానికి రాజమౌళి పర్మిషన్ ఇచ్చేశాడు. జక్కన్న నుంచి పర్మిషన్ వచ్చిందో లేదో మహేష్ వెంటనే ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. తన కూతురు సితార(Sithara)తో కలిసి మహేష్ వెకేషన్ కు బయల్దేరాడు. అంతేకాదు, ఎయిర్పోర్టులో మహేష్ ను క్యాప్చర్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లకు తన పాస్ పోర్టును చూపించి మరీ మహేష్ లోపలికి వెళ్లాడు. ఏదేమైనా మళ్లీ రాజమౌళి నెక్ట్స్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసే లోపు మహేష్ తిరిగి హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది.













