మహేష్- రాజమౌళి మూవీ లేటెస్ట్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటూ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే జక్కన్న స్టోరీ లైన్ చెప్పి, అందరికీ భారీ అంచనాలు నెలకొల్పాడు. దీంతో ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ అంటూ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అవుతుంది. దీనికితోడు అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన హింట్స్ ఇస్తూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా హైప్ పెంచుతున్నారు.
దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎంతో ఇంట్రెస్ట్‌తో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి రేంజ్ ఇప్పుడు దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆయన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇతర దేశ ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ ఊహలకు అందని విధంగా రెడీ చేస్తున్నారట.
సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా కీరవాణి కొడుకు శ్రీ సింహా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. మహేష్- రాజమౌళి సినిమా గురించి తమ ఇంట్లో కూడా అందరూ ఎంతో ఎగ్జయింట్ గా ఉన్నారని, సినిమా పనులు ప్రారంభ దశలో ఉన్నట్లు శ్రీసింహా చెప్పుకొచ్చాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కొనసాగనున్న ఈ స్టోరీ రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే.













