మహేష్ ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉండాల్సింది
ఇప్పుడెక్కడ విన్నా యానిమల్ సినిమా గురించే చర్చ. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తోనే యానిమల్ ఇంత రచ్చ చేస్తుంటే ఇక సినిమా థియేటర్లలోకి వచ్చాక ఇంకెంత రచ్చ చేస్తుందోనని అందరూ అనుకుంటున్నారు. అర్జున్ రెడ్డితో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ, యానిమల్ సినిమాతో సెన్సేషన్ సృష్టించేలా కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే యానిమల్ ట్రైలర్ చూశాక అందరి దృష్టి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మీదకు వెళ్లింది. దానికి కారణం సందీప్ తో సినిమా చేసే అవకాశాన్ని మహేష్ వదులుకోవడమే. అర్జున్ రెడ్డి తర్వాత తన రెండో సినిమాను మహేష్ తో చేయాలని ఎంతో వెయిట్ చేశాడు సందీప్ రెడ్డి. ఆ మేరకు మహేష్ తో డిస్కషన్స్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఆ కాంబోలో మూవీ వర్కవుట్ అవలేదు.
ఈలోపు సందీప్ కు అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ ఆఫర్ రావడం, ఆ సినిమా వర్క్ నచ్చి రణ్‌బీర్ యానిమల్ సినిమాకు కమిట్ అవడం జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు యానిమల్ ట్రైలర్ చూశాక ఇలాంటి డైరక్టర్ తో సినిమా చేసే అవకాశాన్ని మహేష్ ఎలా వదులుకున్నాడా అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. గత కొన్ని సినిమాలుగా మూస సినిమాలు చేస్తున్న మహేష్ కు కానీ యానిమల్ మూవీ పడి ఉంటే ఆ రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉండేది. అసలు మహేష్ కు సందీప్ చెప్పిన కథ ఇదేనా లేక వేరేనా? ఏదేమైనా సరే మహేష్ సందీప్ తో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉండాల్సింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.













