సందీప్ రెడ్డి వంగాను ఆకాశానికెత్తేసిన సూపర్ స్టార్
రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. తన సినిమాల ఈవెంట్ లకు వెళ్లడానికే ఇబ్బందిగా ఫీలయ్యే మహేష్ యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి, దాదాపు రెండు గంటల పాటూ టైమ్ స్పెండ్ చేసి, యానిమల్ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు.
ఈవెంట్ లో భాగంగా మహేష్ మాట్లాడుతూ, యానిమల్ ట్రైలర్ చూశాక తనకు మెంటలొచ్చేసిందని, ఇంత ఒరిజినల్ ట్రైలర్‌ను తానెప్పుడూ చూడలేదని, సందీప్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఇండియాలోనే సందీప్ ది మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ అని మహేష్ కొనియాడాడు. అసలు ఈ ఫంక్షన్ ప్రీ రిలీజ్ లా లేదని, 100 డేస్ ఫంక్షన్ ఉన్నట్లుందని మహేష్ తెలిపాడు.
సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి మాట్లాడుతూ, ఆయన లుక్స్ పై మహేష్ కామెంట్స్ చేశారు. మీ వయసు పెరగదా సర్ అంటూ మీరు మా లాంటి నటులకు ఆదర్శమన్నాడు మహేష్. ఇక రణ్‌బీర్ ను ఉద్దేశించి మాట్లాడిన మహేష్, తను రణ్‌బీర్‌కు పెద్ద ఫ్యాన్ ను అని చెప్పాడు. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్న రష్మిక కోసం ఏదైనా కొత్త భాష కనిపెట్టాలని, ఇంత పెద్ద స్థాయికి ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన మహేష్, చివర్లో యానిమల్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.













