Mahesh Babu: SSMB29లో మహేష్ లుక్ ఇదే!
రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh babu)తో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా ఒడిశాలోని కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. షెడ్యూల్ పూర్తైన తర్వాత సెట్స్ లో డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ నుంచి వచ్చిన ఈ ఫోటోల్లో మహేష్ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన అనధికారిక ఫస్ట్ లుక్ కూడా ఇదే. ఇందులో మహేష్ లాంగ్ హెయిర్, గడ్డంతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మహేష్ లుక్ చూస్తుంటే ఆయన ఎస్ఎస్ఎంబీ29 కోసం ఎంతో మేకోవర్ అయినట్టు అర్థమవుతోంది.
అయితే రాజమౌళి ఈ మూవీ గురించి మొదటినుంచి ప్రతీ విషయాన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నాడు. ఇప్పటివరకు ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించి ఎలాంటి విషయాన్ని రాజమౌళి రివీల్ చేయలేదు. ఇక మూవీ విషయానికొస్తే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఇంతకుముందులా కాకుండా రాజమౌళి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడట.













