1010 చిన్నారులకు ప్రాణదానం చేసిన రియల్ హీరో మహేష్
స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ సేవాగుణంలో కూడా నిజమైన హీరో అనిపించుకున్నారు. సాయం చేసే గుణం అందరికీ ఉండొచ్చు.. కానీ ప్రతిసారి సాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1010 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ప్రాణదానం చేసి కన్నవారి కన్నీళ్లు తుడిచినా రియల్ హీరో మహేష్ బాబు.
పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి.. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొస్తూ సాయం చేయడంలో సరిలేరు నీకెవ్వరూ అనిపించుకున్నారు మహేష్. ఆవ గింజంత సహాయం చేసి తాటికాయంత ప్రచారం చేసుకునే వారున్న ఈ రోజుల్లో గుప్తంగా 1010 చిన్నారులకు వైద్యం అందించినా ఎక్కడా చెప్పుకోకపోవడం మహేష్ గొప్ప మనసుకు నిదర్శనం. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా ఇప్పటి వరకు 1010 చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను నిర్వహించినందుకు ఆర్ధిక సహాయం చేసి ఆ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చిందేలా చేసాడు. హాట్స్ ఆఫ్ మహేష్!!













