మహేష్ నుంచి మరో మంచి పని
మహేష్ బాబు తన పేరిట ఒక ఫౌండేషన్ ను స్థాపించి, దాని ద్వారా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకే మహేష్ ను సూపర్ స్టార్ ఎట్ హార్ట్ అని అందరూ అంటుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తున్న మహేష్ ఓ హాస్పిటల్ హెల్ప్ తో ఎందరో అభాగ్యులైన చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ వస్తున్నాడు.
ఈ ఫౌండేషన్ ద్వారా మహేష్ దాదాపు 2500 హార్ట్ సర్జరీలు చేయించాడు. 2500 సర్జరీలనేది చిన్న విషయం కాదు. దాదాపు ప్రతి రోజూ మహేష్ ఫౌండేషన్ కు ఎన్నో కాల్స్ వస్తుంటాయి. రెగ్యులర్ గా సర్జరీలు జరుగుతుంటాయి. తన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు వచ్చిన సమస్యను దృష్టిలో పెట్టుకుని, పేదలకు అలాంటి సమస్య వస్తే ఎలా అని ఆలోచించి ఈ ఫౌండేషన్ ను స్థాపించినట్లు మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే.
అంతటి గొప్ప మనసున్న మహేష్, ఇప్పుడు తన తండ్రి కృష్ణ పేరు మీద మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. కృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద విద్యా నిధి పథకాన్ని ప్రారంభించి, అందులో భాగంగా 40 మంది టాలెంటెడ్ పేద విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని వారికి స్కూల్ నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం అందించనున్నాడు. తండ్రి పేరు మీద మహేష్ చేస్తున్న మంచి పనికి ఆయన మీద అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.













