గుంటూరు కారంలో మహేష్ కబడ్డీ సీన్స్
మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. మహేష్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. 2022లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ మహేష్ తర్వాతి సినిమా అయిన గుంటూరు కారం పైనే పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో లేటవుతూ వస్తోంది.
ఈ యేడాదే రిలీజ్ కావాల్సిన గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది. సినిమా లేట్ అయినా సరే సినిమాలో ఇంట్రస్టింగ్, ఫ్యాన్స్ కి హై ఇచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో త్రివిక్రమ్ మార్క్ కామెడీ సీన్స్ ఉంటాయంటున్నారు. అంతేకాదు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ఆడనున్నాడని ఆ సీన్స్ ను ఫస్ట్ షెడ్యూల్ లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. అప్పుడెప్పుడో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమాలో కబడ్డీ ఆడి మెప్పించిన మహేష్, ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ సినిమాతో గుంటూరు కారం కోసం కబడ్డీ ఆడనున్నాడని తెలిస ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.













